Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog

సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన లోక ప్రవీణ్ రెడ్డి 

0
loka praveen reddy 
loka praveen reddy 

చిత్రం న్యూస్, భోరజ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి కలిశారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ-మహారాష్ట్ర నడుమ  పెన్ గంగా నదిపై భోరజ్ మండలంలో నిర్మించిన చనాఖా- కొరటా బ్యారేజ్ హత్తిఘాట్ పంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేసేందుకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డిని హెలిప్యాడ్ దగ్గర శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.

 

జంగుబాయి దేవతకు పూజలు 

0
జంగుబాయి 
జంగుబాయి 

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని దత్తగూడ జామిని పంచాయతీ దత్తగూడ గ్రామంలో అడవి తల్లి, ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి దేవతకు పూజలు చేశారు. ప్రతి సంవత్సరం పుష్య మాసంలో ఆదివాసీ గిరిజనులు జంగుబాయి  దేవతను ఘనంగా పూజిస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొడప రాము, చిన్న భీమా, కొడప లక్ష్మి బాయి, కొడప సోనేరావు తదితరులు పాల్గొన్నారు.

 

సీఎం రేవంత్ రెడ్డిని సత్కరించిన సామ రూపేష్ రెడ్డి

0
Cm revanth reddy
Cm revanth reddy

చిత్రం న్యూస్, భోరజ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి కలిశారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం తెలంగాణ-మహారాష్ట్ర నడుమ  పెన్ గంగా నదిపై నిర్మించిన చనాఖా- కొరటా బ్యారేజ్ హత్తిఘాట్ పంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదలకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డిని హెలిప్యాడ్ దగ్గర శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.

సంక్రాంతి క్రికెట్‌ టోర్నీ విజేత జీవైసి

0

చిత్రం న్యూస్, తాంసి: తాంసి ప్రీమియర్ లీగ్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రికెట్‌ కప్‌ పోటీలు హోరాహోరీగా జరిగాయి.విద్యానగర్, ఆటో యూనియన్, అంబేద్కర్ యువజనసంఘం, జ్ఞానోదయ యువజన సంఘం పేరుతో మొత్తం 4 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో జ్ఞానోదయ యువజన జట్టు విజేతగా నిలిచింది. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఫైనల్‌ పోటీల్లో జీవైసి 8 ఓవర్లలో 45 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌ దిగిన ఏవైసీ జట్టు ఐదు ఓవర్లలో 18 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. పోటీల్లో గెలుపొందిన జట్టుకు టీపీఎల్ చైర్మన్ రత్న ప్రకాష్ ప్రైజ్ మని అందజేశారు.

శివాలయం నిర్మాణానికి రూ.21వేల నగదు విరాళం 

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి పెన్ గంగ నది ఒడ్డున నిర్మిస్తున్న భారీ శివాలయ నిర్మాణానికి బేలలోని హనుమాన్ ఫెర్టిలైజర్ యజమాని ఇట్టడి రాజారెడ్డి, ఆయన తనయుడు సుశాంత్ రెడ్డి విరాళం అందజేశారు. గురువారం ఆ గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూ.21 వేలు విరాళo అందజేశారు. ఈ సందర్భంగా వారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు పాల్గొన్నారు.

గాలిపటం ఎగురవేస్తూ విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్ధి

0

చిత్రం న్యూస్, భోరజ్: వినోదం కోసం ఎగురవేసే గాలిపటం ఓ విద్యార్థి జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం బాలాపూర్‌ గ్రామంలో గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బాలయోగి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బాలయోగి తన ఇంటిపై గాలిపటం ఎగురవేస్తుండగా, గాలిపటం దారం పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. విద్యుత్ ప్రవాహం దారం ద్వారా విద్యార్థి కి సోకడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో  శరీరం తీవ్రంగా కాలిపోయింది. వెంటనే గమనించిన కుటుంబీకులుకి చి త్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భజన పోటీలకు ఆహ్వానం

0

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భజన పోటీలు నిర్వహిస్తున్నారు. 24-01-2026 శనివారం రాత్రి 8:00 గంటల నుండి పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ బహుమతి రూ.11 వేలు, రెండోబహుమతి రూ.5 వేలు, మూడో బహుమతి రూ.3 వేలు, ఉత్తమ గాయకుడు రూ.వేయి, ఉత్తమ వాద్య సంగీతానికి రూ.వేయి నగదు అందజేయనున్నారు. ప్రతి భజన మండలిలో ఏడుగురు సభ్యులు ఉండాలని,భక్తి గీతాలు, తత్వగీతాలు పాడవచ్చని (చూసి పాడకూడదు)  పేర్కొన్నారు. ప్రదర్శించే బృందమునకు 30 నిమిషములు సమయం ఉంటుందన్నారు.భజన మండలి వారు 5 పాటలు పాడాలని (సమయ పాలన పాటించాలి), ఈ 5 పాటలలో శ్రీ వేంకటేశ్వరుని గురించి ఒక భక్తి గీతం పాడాలని తెలిపారు.భజన సామాగ్రి (హార్మోనియం, తబలా, తాలాలు) ఎవరివి వారే తెచ్చుకోవాలన్నారు.  తుది నిర్ణయంన్యాయ నిర్ణేతలదేనని, భజన కళాకారులకు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.పాల్గొనేవారు ఫోన్ నంబర్లు 9441015240, 9441239091 కి సంప్రదించాలని సూచించారు.

ఆపదలో అండగా అభిమన్యు గ్రూప్

0

మడావి రూప్ దేవ్ కుటుంబానికి రూ.85 వేలు ఆర్థికసాయం అందజేత

చిత్రం న్యూస్, నార్నూర్: నార్నూర్ మండలం బాబేఝారీ గ్రామంనికి చెందిన నిరుపేద విద్యార్థి మడావి  రూప్ దేవ్ తండ్రి రాజు, తల్లి లక్ష్మిబాయి కిడ్నీ స్టోన్ తో బాధపడుతున్న సమయంలో రూప్ దేవ్ కుటుంబం సభ్యులకు ధైర్యం ఇస్తూ అండగా నిలిచారు అభిమన్యు సభ్యులు. విద్య, వైద్యం, పేదల కోసం ఎల్లప్పుడూ నిరంతరం సహాయసహకారాలు అందిస్తూ అండగా ఉంటామని గ్రూప్ సభ్యుడు మెస్రం శేఖర్ బాబు అన్నారు. దాతలు అందజేసిన రూ. 85 వేల నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పెందోర్ దాదిరావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, సామాజిక సేవకుడు, ఉపాధ్యాయుడు మెస్రం లింగు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు మడావి చంద్రహరీ, రాజ్ గోండు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కుంరం చత్రుశావ్, జిల్లా నాయకులు మరప గంగారాం, ఆదివాసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు పెందోర్ మధు, మరప గంగారాం,  విద్యార్థి సంఘం నాయకులు మెస్రం కేశోరావు, కోట్నాక్ శ్రీరామ్, ఆత్రం అజేయ్, తుంరం సంతోష్,  గ్రామ పటేల్ మాడావి లింగు, నూతన సర్పంచ్ పెందోర్ లింగు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

సాంగిడి  గ్రామ పంచాయితీ పాలకవర్గానికి సన్మానం

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడిలో ఆ గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించారు. సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్ తో పాటు సభ్యలను సన్మానించి శాలువాతో సత్కరించారు.ఈ  సందర్బంగా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు చిప్ప రమేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా పాలకవర్గ సభ్యులందరు కలిసి కట్టుగా పని చేయాలని కోరారు.గ్రామంలో గల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ సందర్బంగా కోరారు.ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యం, మురుగు కాలువల నిర్వహణ చేపట్టాలన్నారు.ఈ  కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీతోనే సమస్యల పరిష్కారం: స్లాటర్ హౌస్ తొలగింపులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: బీజేపీకి ఓటు వేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను సైతం మేము చేసి చూపిస్తున్నాం” అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణం నుంచి కచ్‌కంటి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న స్లాటర్ హౌస్ (కబేళా)ను మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఆయన దగ్గరుండి తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

దశాబ్దాల సమస్యకు విముక్తి: గత 30 ఏళ్లుగా ఈ స్లాటర్ హౌస్ నుంచి వస్తున్న దుర్వాసనతో స్థానిక ప్రజలు నరకయాతన అనుభవించారని, దీనిపై గతంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మున్సిపల్ చైర్మన్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు.దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాట నిలబెట్టుకున్న బీజేపీ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ తొలగింపు కార్యక్రమం చేపట్టామని తెలిపారు.రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలతో పాటు పట్టణంలో తోపుడు బండ్ల క్రమబద్ధీకరణ వంటి పనులు బీజేపీ పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.అన్ని శాఖల అధికారుల సమన్వయంతో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ స్లాటర్ హౌస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలా మున్న, కృష్ణ, మున్సిపల్ అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.